త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ధారూర్ సర్కిల్ సి.ఐ. సిహెచ్. రఘురాములు, మోమిన్‌పేట్ ఎస్.ఐ. ఎం. అరవింద్ ప్రముఖంగా ఉన్నారు. డి.పి.ఓ. కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్లు మొహమ్మద్ అయూబ్, ఎం. సాయి ప్రసాద్, మరియు ఐటీ సెల్ నుండి ఎం. కేశవులు తమ సేవలకి గుర్తింపు పొందారు.
జిల్లాలోని వివిధ ప్రత్యేక విభాగాల నుండి జి. కృష్ణ( డి సి ఆర్ బి) ఎస్. ప్రమీల మరియు కె. మీన (డి.ఎస్. పి) టి. రామకృష్ణ (క్లూస్ టీమ్), ఎం. పార్వతీశం(పి సి ఆర్) మరియు పి. చంద్ర శేఖర్( డిటిసి) ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సామాజిక సేవలో భాగంగా భరోసా కేంద్రం సపోర్ట్ పర్సన్ జి. హెప్జిబా, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ వి. రమేష్ కూడా ఈ జాబితాలో నిలిచారు.
వివిధ పోలీస్ స్టేషన్లలో క్షేత్రస్థాయిలో విశేష సేవలందించిన కానిస్టేబుళ్లు మరియు హెడ్ కానిస్టేబుళ్లలో జమీల్ (చెంగోముల్), రమేష్ వర్మ(కొడంగల్), ఎస్. గోపాల్ మరియు ఎండి. జహంగీర్ పాషా (పరిగి), బలరామ్ (మోమిన్‌పేట్), నర్సిములు (వికారాబాద్), నరేష్ (ధారూర్), జయవర్ధన్ (సిసిఎస్) జె. సాయికృష్ణ యాదవ్ (తాండూర్), బి. అశోక్ కుమార్ (కరంకోట్), ఎం. శ్రీనివాస్ (యాలాల), మరియు కె. నాగేంద్ర (బషీరాబాద్) జిల్లా అధికారుల నుండి పురస్కారాలు అందుకున్నారు. వీరితో పాటు డి.ఏ.ఆర్. హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్. వెంకటయ్య, శేఖర్, బి. జగ్గమ్మ, మరియు యు. సత్యనారాయణ కూడా ఉత్తమ పనితీరు కనబర్చిన వారిలో ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


