100-day Action Plan : వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా

TRINETHRAM NEWS

రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ ఆదేశాల మేరకు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శనివారం దోమల లార్వా తినే గoౠషియా చేపపిల్లలను నీటి కుంటలలో వదిలారు. మత్స్య శాఖ సహాకారంతో మొదటి దఫాలో ఐదు వేల గoౠషియా చేప పిల్లలను కరీం నగర్ నుండి తెప్పించి డివిజన్ లలో గుర్తించిన కుంటలు , నీరు ఎక్కువగా నిలిచి ఉండే ప్రాంతాల్లో ఈ చేపలను వదిలినట్లు కమిషనర్ తెలిపారు. లార్వా అంతరించిపోతే దోమలు సంతతి పెరగడానికి అవకాశం ఉండదని అన్నారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్ , ఆయిల్ బాల్స్ వేయడం , స్ప్రేయింగ్ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని అన్నారు.

స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు క్లీన్ లీ నెస్ టార్గెట్ యూనిట్స్ (సి టి యు ) కూడా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద శనివారం గౌతమి నగర్ ప్రాంతంలో చిన్న చిన్న నీటి కుంటలను గుర్తించి నీరు నిలువ ఉండకుండా జి సి బి యంత్రం తో చదును చేయించినట్లు తెలిపారు. ప్రజలు కూడా దోమ కాటు కు గురి కాకుండా కిటికీలకు జాలీలు అమర్చుకోవడం , పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలని కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

100-day action plan

You cannot copy content of this page

Scroll to Top