జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 11 : ఆంధ్రా ఊటీ అరకులోయలో వారం రోజుల నుండి త్రాగునీరు సరఫరా లేక ప్రజల గొంతుండుతోందని తక్షణమే ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ అధికారులు స్పందించి మంచి నీరు అందించాలని సరభగుడ హౌసింగ్ కాలనీ గ్రామస్థులతో కలిసి మరమత్తుకు గురైన బోటింగు కుళాయి వద్ద ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ పెదలబుడు పంచాయితీ అరకులోయ పట్టణంతో పాటు సరభగుడ, జడ్పీకొలాని, సీకొలాని, బి కొలాని, రెంటల్ కోలాని, కొండవీధి, ఆదివాసీ కోలాని సరభగుడ హౌసింగ్ కోలాని, ఆసుపత్రి కోలాని తదితర ప్రాంతాల్లో వారం రోజుల నుండి మంచి నీరు సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సమస్యను తీర్చాలని వేసవి ప్రారంభంలోనే మంచినీటి సమస్య తలెత్తితే ఇకముందు నీటి సమస్య ఏ స్థాయిలో ఉండాబోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ అధికారులు మరమ్మతుల పేరుతో లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని శాశ్వత పరిష్కారం చేయడం లేదని ఇకనైనా ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయితీ అధికారులు చర్యలు తీసుకుని అరకులోయ పట్టణంతో పాటు గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సరభగుడ హౌసింగ్ కొలని గ్రామస్తులు మాదాల కాసులమ్మ, కొర్రా రాజేశ్వరి, పి మణి, కిల్లో కుమారి, మల్లేశ్వరి, కిల్లో రాజు, అజయ్, కొర్రా వెంకటరావు, మాదాల నినిబుడ్డి, బురిడి డొమిని, వంతాల విజయ్ రాజు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

good water supply

You cannot copy content of this page