ANDHRAPRADESH

Araku youth support child : చిన్నారి పునర్వికకు అండగా అరకు యువత – మానవత్వానికి నిదర్శనం

TRINETHRAM NEWS

డుంబ్రిగూడ,ఫిబ్రవరి 27, (త్రినేత్రం న్యూస్): కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు మానవత్వం ఒక్కటైంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారికి సుమారు రూ.16 కోట్ల విలువైన ప్రత్యేక ఇంజక్షన్ అవసరమవడంతో (ఎస్ఎం) వేదికగా జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రారంభమైన ఈ సహాయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండలం, అరకు గ్రామంకు చెందిన యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. శంకర్, నాగు, ధర్మ, రమేష్, భవానీ శంకర్, జగదీష్ ఆధ్వర్యంలో గ్రామంలో విరాళాల సేకరణ చేపట్టి మొత్తం రూ.10,250ను సేకరించి చిన్నారి పునర్విక తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని ఆదుకోవడం కోసం అరకు యువత చేయి చేయి కలిపిందని తెలిపారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించారని, విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. సేకరించిన మొత్తాన్ని బాధిత చిన్నారి కుటుంబానికి ఇప్పటికే అందజేసినట్లు పేర్కొన్నారు.
చిన్నారి పునర్విక త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని స్థానికులు ఆకాంక్షించారు. మానవత్వాన్ని చాటుకున్న అరకు యువతను గ్రామ ప్రజలు అభినందించారు. ఈ సందర్భంగా పాప తండ్రి ఇప్పటి వరకు విరాళాలు అందించిన దాతలకు, మరియు ఇప్పటికి అందిస్తున్న దాతలకు, కృతజ్ఞతలు చెబుతూ, ఇక డబ్బు పంపొద్దు అని వీడియో రిలీజ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Araku youth support child's recovery

You cannot copy content of this page