National Family Benefit Scheme : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) ఆగష్టు 28 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్ ఎఫ్ బీ ఎస్. )క్రింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద18 సంవత్సరాలనుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కుటుంబం పెద్ద మరణించి నట్లయితే బాధిత మహిళాకుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.
ఏప్రిల్ 01 – 2017 తర్వాత కుటుంబ పెద్ద మరణించివున్నవారు ఈ పథకానికి అర్హులు. 30/08/2025 శనివారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు, సంబంధిత గ్రామ పంచాయతీ లో గాని, తహశీల్దార్ కార్యాలయం గుండ్లపల్లి లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జత చేయవలసిన పత్రాలు
1 మరణ ధ్రువీకరణ పత్రం
2 ఆధార్ కార్డు
3 రేషన్ కార్డు
4 బ్యాంకు పాసు పుస్తకం
5 ఆదాయ ధ్రువీకరణ పత్రం
ఈ పత్రాలను జతపరచాలని డిండి మండల తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

National Family Benefit Scheme

You cannot copy content of this page

Scroll to Top