Trinethram News : మెగా డీఎస్సీ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా.. మొత్తం 12 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ పరీక్ష రెండు షిఫ్ట్‌లో అంటే.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటే, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాలకు ప్రతీ అభ్యర్థి గంటన్నర ముందే చేరుకోవాల్సి ఉంటుంది. సమయం మించిన తరువాత అనుమతి ఉండదు. కాగా, అభ్యర్థులంతా సమయంలోగానే కేంద్రానికి చేరుకోవాలని, ఆలస్యం చేసి ఇబ్బందులు ఎదుర్కోవద్దని సూచిస్తున్నారు అధికారులు.
ఇటీవల విడుదల చేసిన హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని తమతో కేంద్రానికి తీసుకురావాలి. దాని మీద మీ ఫోటో లేకపోతే మరో 2 ఫోటోలు తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో ఏదైనా తప్పులు కనిపిస్తే ఆధార్, పాన్ , ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులు చూపించొచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


