WhatsApp Image 2024 01 31 at 12.18.42 PM
40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. జగనన్న తోడు నిధుల విడుదలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో చర్చ. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం. వైద్య ఆరోగ్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిస్థితులు పై మంత్రులతో సీఎం జగన్ చర్చ.
