“భోగి మంట” వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం: త్రినేత్రం, న్యూస్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వెంకటరెడ్డి (డి వి ర్ ) ఆధ్వర్యంలో 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ దుంగలు భోగి మంట కోసం ఏర్పాటు చేశారు.గత 70 ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక తెలిపారు.
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగిమంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు.
సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App