త్రినేత్రం న్యూస్, నవంబర్ 06,అనపర్తి, ఇటీవల అంబాజీపేట జెడ్.పి హైస్కూల్లో జరిగిన 69 వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారు నిర్వహించిన స్కూల్స్ క్రికెట్ గేమ్స్ లో జి.బి. ఆర్ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కొవ్వూరి నాగ సాత్విక్ రెడ్డి, మరియు ద్వారంపూడి వెంకట సహర్ష్ భీమా రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరచి అండర్ – 14 విభాగంలో స్టేట్ మీట్ కు మెయిన్ ప్లేయర్స్ గా సెలెక్ట్ అయ్యారు. జి.బి.ఆర్ క్రికెట్ అకాడమీ ఈ విద్యార్థులకు ఉత్తమ తర్ఫీదునిచ్చి ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే ఇద్దరు విద్యార్థులను స్టేట్ మీట్ కు పంపిన ఘనతను దక్కించుకుంది.
ఈ సందర్భంగా జి.బి.ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు), జి.బి.ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీన్ G.హరి ప్రసాద్ , హై స్కూల్ హెచ్.ఎం. రామారావు , ప్రైమరీ హెచ్.ఎం. భువనేశ్వరి, ప్రీ ప్రైమరీ హెచ్.ఎం. కామాక్షి, ఇంచార్జులు, వెంకటరెడ్డి, వెంకటరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి రెడ్డి, గేమ్స్ డైరెక్టర్ మహేంద్ర రెడ్డి, ఏవో ఆచారి, విద్యార్థులను, వారి వారి కోచ్ లు సిహెచ్ శ్రీనివాసరావు(ఆర్ వీ), సతీష్, మూర్తి లను అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


