IMG 20241104 WA0046
అనంతగిరి కార్తీక మాసం జాతర ఉత్సవాలకు సహకరిస్తా మున్సిపల్ చైర్ పర్సన్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ తరఫున అన్ని విధాల సహకరిస్తాం : మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ .*కార్తీక మాసం అనంతగిరిజాతరఉత్సవాలను పురస్కరించుకొని.. అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరగబోయే జాతర ఉత్సవాల కోసం వికారాబాద్ మున్సిపల్ నుండి శానిటేషన్ నిర్వహణ, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలు అలాగే మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఈరోజు ఆలయ చైర్మన్ పద్మనాభం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేషకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జాతర ఉత్సవాలు విజయవంతం చేయడానికి సహకరించాలని చైర్ పర్సన్ ను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన చైర్ పర్సన్ ప్రతిసంవత్సరంలానే ఈ ఏడాది కూడా మున్సిపల్ తరఫున చేయాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ కు స్వామివారి ప్రసాదం అందిస్తూ జాతర ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ EO నరేందర్, శాంతప్పలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
