Nirmala Sitharaman’s New Approach : బడ్జెట్ ప్రసంగంలో వినూత్న మార్పు.. నిర్మలా సీతారామన్ నూతన విధానం

TRINETHRAM NEWS

Trinethram News : Feb 01, 2026, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

ఈసారి బడ్జెట్ ప్రసంగంలో గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న శైలిని మార్చి, ‘పార్ట్-B’లో ‘వికసిత్ భారత్’ విజన్‌ను, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను వివరంగా వివరించనున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చేలా భారత ఆర్థిక రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించనున్నారు.

నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. పన్ను చెల్లింపుదారులు ‘పార్ట్-B’లో పన్ను విధానాన్ని సరళతరం చేసే కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nirmala Sitharaman's new approach

You cannot copy content of this page

Scroll to Top