
రాజమహేంద్రవరం: జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134 వ జయంతి ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేక్ కటింగ్ చేసి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల హక్కులకు రూపం కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ప్రజలకు స్వేచ్ఛ కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధన ద్వారా మాత్రమే సమసమాజ స్థాపన సాధ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ( అడ్మిన్) ఎం.బీ.ఎన్ మురళీకృష్ణ , అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏ.వి సుబ్బరాజు , అడిషనల్ ఎస్పీ( క్రైమ్స్) ఎల్. అర్జున్, అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) ఎల్. చెంచి రెడ్డి , డి.ఎస్.పి. (ఎస్ బి) బి. రామకృష్ణ , డీఎస్పీ (ఏ ఆర్) రవికుమార్, ఇన్స్పెక్టర్ (ఎస్ బి) ఏ. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ (డి సి ఆర్ బి) పవన్ కుమార్ రెడ్డి, ఆర్ ఐ లు, పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్. రఘురాం, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
