WhatsApp Image 2023 12 23 at 5.47.07 PM
పీకే..లోకేష్ కలయికపై అంబటి సెటైర్
AP: టీడీపీ నేత లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషార్ కలయికపై అధికార పక్ష నేతలు విమర్శలు ప్రారంభించారు. టీడీపీపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టే మంత్రి అంబటి రాంబాబు తాజాగా మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ పీకే భేటీపై వ్యంగ్యంగా స్పందించారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రీ ఏమి చేయగలడు అంటూ ఎద్దేవా చేశారు. అంబటి విమర్శలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
