Alumni Reunion : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొనీ, ఈ సందర్భంగా మాట్లాడారు విద్యా సంస్థలు సమాజ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. కళాశాల ప్రతిష్టను, మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు.
కళాశాల పేరును ఆధునిక నమూనా విద్యా సంస్థగా తీర్చిదిద్దుతూ, ప్రజలకు ప్రత్యేక సేవలందించిన మాజీ మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి పేరుతో అభివృద్ధి చేసే విషయంపై చర్చలు జరిపినట్టు తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు, శిక్షణా ప్రమాణాలను పెంచేందుకు, అవసరమైన వాటిని తక్షణమే గుర్తించి అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ విద్యా కాలపు జ్ఞాపకాలను తలుచుకున్నారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు రావాలని పూర్వ విద్యార్థులను ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ మెంబర్ చిలువేరు కాశీనాథం, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి రమేష్, పూర్వ విద్యార్థి నాయకులు రాము చౌహాన్, లాలు నాయక్, ఇల్లెంతుల శ్రావణ్, కొండయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Alumni Reunion

You cannot copy content of this page

Scroll to Top