Alluri Seetharamaraju’s Birth Anniversary : హుకుంపేటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

జై భీమ్ జర్నలిస్టులు సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

అల్లూరిజిల్లా (హుకుంపేట) త్రినేత్రం న్యూస్ జూలై 5 : అల్లూరి జిల్లా హుకుంపేట ప్రధాన కేంద్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జై భీమ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జయంతి పురస్కరించి మండల పరిధిలో గల పేద మహిళలకు, పురుషులకు ఉచితంగా చీరలు, శాలువాలు పంపిణీ చేశారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంకు హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు మాట్లాడుతూ ముందుగా జై భీమ్ జర్నలిస్ట్ సోదరులకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని, ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు అది మన మన్యం బిడ్డ అల్లూరి సీతారామరాజు వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా చేసుకుంటాం.

కానీ నేడు ఆయన జన్మదినం పురస్కరించి పేదలకు ఉచితంగా వస్త్ర దానం తో పాటు సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని, ఆనందకరం కాదు ఒక గొప్ప విషయం అని అన్నారు. మనం నేడు ఇంత స్వేచ్ఛ జీవితం కొనసాగిస్తున్నామంటే దానికి కారణం మన స్వాతంత్ర్య సమరయోధులని ఆనాడు ఎంతోమంది పోరాట యోధులు ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకు రావడం వలనే మనం నేడు బానిస బ్రతుకులు వీడి స్వాతంత్రంగా బ్రతుకుతున్నామని, ఆ పోరాటయోధుల్లో మన ప్రాంతం మన మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించారని అటువంటి విప్లవ వీరులు మన వాసి కావడం మన పూర్వజన్మ సుకృతమని తెలిపారు.

మనకు బానిస బ్రతుకులు నుండి విముక్తి కల్పించి ఇంత స్వేచ్ఛ జీవితం కల్పించిన ప్రతి పోరాట యోధుడుకు ప్రతి పౌరుడు గౌరవించాలని ముఖ్యంగా వారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు విధిగా చేసి వారిని స్మరించుకోవాలని అన్నారు. అలాగే మరొకసారి ఇంతటి మంచి సేవా కార్యక్రమం చేపట్టిన జై భీమ్ జర్నలిస్టుల సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఈ సంఘం ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకువచ్చి అవి పరిష్కారం అయ్యేలా చేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Alluri Seetharamaraju's birth anniversary

You cannot copy content of this page

Scroll to Top