బీ ఆర్ ఎస్ లో చేరికలు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఖాయం
గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి.
రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు .
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 30 త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఖాయం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లెపల్లి మాజీ ఎంపీటీసీ చెనగొని శివ గౌడ్ పాటు పలువురు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..-గత పదేళ్ళలో కేసీఆర్ చేసిన అభివృధి సంక్షేమ పథకాలే
బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయి అని ఆయన అన్నారు.గ్రామాల్లో బిఆర్ఎస్ సానుభూతిపరులను, కేసీఆర్ అభిమానులను ఏకం చెయ్యాలి అని కోరారు.రెండేళ్ల నుండి కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ చేసిన మోసాలు, బిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రజల వద్దకు వెళ్లాలి అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు అని ఆయన తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సర్వేలలో బిఆర్ఎస్ పార్టీదే హవా అని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేక ఇన్ని రోజులు కాలయాపన చేసింది అని ఆయన గుర్తు చేశారు.అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన తెలిపారు.గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీ విజయానికి దోహదపడాలి అని ఆయన అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


