Sekhar Reddy : శ్రీపరాభవనామ సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలి

TRINETHRAM NEWS
All auspicious things should happen

ప్రజలంతా సుఖశాంతులతో , సోదరభావంతో మెలగాలని ఆకాంక్షిస్తూ….

ఉలుపాల శేఖర్ రెడ్డిబిఆర్ఎస్ పార్టీ నాయకులు .

Sekhar Reddy : చింత పల్లి మార్చ్ 19, త్రినేత్రం న్యూస్. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరిగేలా చూడాలని శ్రీరాముల వారిని కోరుతున్నట్టు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు.గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద పురోహితులు నిర్వహించిన పంచాంగ పఠనం లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని రంగాల ప్రజల ఆశలు చిగురించి ప్రతి ఇంటా సిరులు పండాలని కోరారు.

తెలుగు వారి కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై.. వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు..ఉగాది గొప్ప పర్వదినం అని తెలిపారు.షడ్రురుచుల వలె గ్రామ ప్రజలు కలిసిమెలసి ఐక్యతతో ముందుకు సాగాలని..ప్రకృతి అనుకూలించి రైతులతో పాటు ఉద్యోగ వ్యాపార అన్నిరంగాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top