జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Alfors students excel in CBSE

Alfors Students : త్రినేత్రం న్యూస్ : చక్కటి ప్రణాళికల ద్వారా మరియు సరైన పద్ధతిలో సమీక్ష నిర్వహణ ద్వారా విద్యార్థులచే విజయాలను సులభంగా సాదింప చేయవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో అల్ఫోర్స్ సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు నేడు ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల నిర్వహించినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి అధ్యాపకులచే బోధన అందిస్తూ అగ్రగామిగా నిలుపుతున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో పై చేయి సాధించడం మరియు ఇప్పటివరకు ప్రకటించినటువంటి అన్ని రకాల పరీక్షల ఫలితాల్లో స్ఫూర్తిదాయకమైన మార్పులతో ఆదర్శంగా నిలిచినదని సంతోషం వ్యక్తం చేశారు.
7గురు విద్యార్థులు 460 పైగా సాధించారని మరియు 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా గొప్ప విషయమని చెప్పారు.
పిసీఎం విభాగం
వి. శ్రేయాస్ రెడ్డి,475 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానంలో నిల్చాడని, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాష్ 469 మార్కులు, బి.లిఖిత్ సాయి 461 మార్కులు, కే. ఐశ్వర్య 458 మార్కులు, హర్షఫ్ అర్మాన్ 456 మార్కులు, వి.సాయి హర్షిత్ 456 మార్కులు, బి రోహిత్ 455 మార్కులు, ఎన్‌‌.కావ్య & జె.సరయు 450 మార్కులు మరియు తదితరులు మంచి మార్కులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు
పిసిబి విభాగం
డి.రుత్విక్, 476 మార్కులు తో పాఠశాలలో ప్రధమస్థానంలో నిలిచాడని, పి.శృత్విక 472 మార్కులు, డి.శ్రేయన్ష్ 462 మార్కులు మరియు తదితరులు అత్యుత్తమ మార్కులు సాధించారని చెప్పారు అధ్యాపకుల యొక్క నిరంతర కృషితో మరియు తల్లిదండ్రుల యొక్క అమూల్యమైనటువంటి సహకారంతో ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు.
గత 36 సంవత్సరాలుగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు చాలా చక్కటి కార్యక్రమాలతో మరియు ప్రపంచ ప్రమాణాలను పాటింపచేస్తూ భారతదేశంలో గుర్తింపు పొందిన బోధనా సిబ్బందితో బోధిస్తూ అగ్రగామిగా ఉంటున్నామని వారు చెప్పారు‌
చాలా చక్కటి ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలను & స్కోర్ కార్డ్స్ అందజేసి అభినందించారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page