WhatsApp Image 2024 03 29 at 17.40.07
ఒక్కసారి ప్రవేశం లభిస్తే 11వ తరగతి వరకు బిందాస్‌గా ఉండడంతో ఇందుకోసం పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు…
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్రీయ విద్యాలయాల్లో తమ పిల్లలకు సీటు రావడానికి పేరెంట్స్ ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. నామ మాత్రపు ఫీజుతో మంచి నాణ్యమైన విద్య, సీబీఎస్‌ఈ ఎడ్యుకేషన్ అందుతుండడంతో చాలా మంది ఈ దిశగా ఆలోచనలు చేస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ న్యూస్. 2024-25 ఏడాదికి గాను ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేశారు. అధికారులు.
ఒక్కసారి ప్రవేశం లభిస్తే 11వ తరగతి వరకు బిందాస్‌గా ఉండడంతో ఇందుకోసం పోటీ తీవ్రంగా నెలకొంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే చిన్నారుల వయసు మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వారి వారి ప్రయారిటీ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. వీటిలో మొదటగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు ఇలా ప్రయారిటీలను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు.
మొదటి లిస్ట్ ఆధారంగా మిగిలిన ఖాళీలను బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే రెండో తరగతితో పాటు ఆపై తరగతుల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు సయాన్ని ఇచ్చారు.
