Akhanda 2 Premiere Cancelled అఖండ2 ప్రీమియర్ షో రద్దు

TRINETHRAM NEWS

Trinethram News : మరో రెండు గంటల్లో ప్రీమియర్ షో ప్రదర్శన ఉండగా సాంకేతిక కారణాలవల్ల రద్దు చేస్తున్నట్లు అఖండ2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్రకటించింది..! సినిమాకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సియర్లు యాబై కోట్ల విషయంలో చెల్లింపులు జరగకపోవడంతో సినిమా ప్రీమియర్ షో ప్రదర్శనను అడ్డుకున్నట్లు తెలుస్తోంది..

మరోవైపు సినిమా విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… నిర్మాణ సంస్థ వ్యవహారశైలిపై ముందునుండి అనుమానాలు ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి… విడుదలకు ముందు టిక్కెట్లు అన్ని బుకింగ్ అయిన తర్వాత ఇలా రద్దు చేయడమేంటని బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

తమ అభిమాన నటుడి సినిమాపై ఆది నుండి కుట్రలు నడుస్తున్నాయని.. అఖండ 2 కు దేశవ్యాప్తంగా వచ్చిన హైప్ ను చూసి కుళ్ళుకుంటున్న కొందరు కావాలనే… విడుదల విషయంలో అడ్డుకుంటున్నారని అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు…

నిర్మాతలపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు…

మొత్తం మీద ప్రీమియర్ షో రద్దు కావడం.. రేపు థియేటర్లలో విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా బాలయ్య అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… రేపు సినిమా థియేటర్లలో విడుదల కాని పక్షంలో నిర్మాతల అంతు చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు…

మరోవైపు ఏపీకి చెందిన బాలయ్య అభిమానులు టీడీపీ కార్యకర్తలు మరోవిధంగా స్పందిస్తున్నారు… ప్రతిపక్ష నాయకుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు మా బాలయ్య సినిమాల విడుదలకు ఎలాంటి అడ్డంకులు కలగలేదని.. ఇపుడు అధికారంలో ఉన్నామని.. తెలంగాణలో కూడా అనుకూలంగా ఉన్న రేవంత్ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఎందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయో అర్థం కావడం లేదని.. కొత్త సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..

అఖండ2 ఆధ్యాత్మికంగా గొప్ప సినిమాగా కనిపిస్తోందని.. ఇలాంటి మంచి సినిమాకు అడ్డంకుము సృష్టించడం తగదని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు

చూడాలి ఎంజరగబోతోందో..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Akhanda 2 premiere show cancelled

You cannot copy content of this page

Scroll to Top