ఘనంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు

TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా: జనవరి 15
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.

దీంతో స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతున్నది. మల్లన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

కాగా, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు స్నానపు గదులు లేకపోవడంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు…

You cannot copy content of this page

Scroll to Top