ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జిల్లాఇంచార్జ్ ) ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC వేపాడ చిరంజీవి రావు కు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ విజ్ఞప్తి.*
2025 ఏప్రిల్ 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడం వలన ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 100% ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వలేదు.రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో అల్లూరిసీతారామరాజు జిల్లాలో 400 పోస్టులకు గాను ఎస్టీలకు కేవలం 24 పోస్టులుమాత్రమే కేటాయించారు. ఆదివాసీలకు 6శాతం, ఓపెన్ కేటగిరీలో 94%పోస్టులు కేటాయించడం ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వం పునర్పరిశీలన చేయాలని డిఎస్సీ సాధన కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.
ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తున్న జీఓ నెంబర్ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రత్యామ్నాంగా నూరుశాతం రిజర్వేషన్ కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్డ్ ఏరియా) రెగ్యులేషన్ ఆఫ్ రిజర్వేషన్ & అపాయింట్మెంట్ టు టీచర్ పోస్ట్ ఇన్ దిఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ 1 ఆఫ్ 21) ఆన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను తేది. 27 – 7 – 2021న 112వ టిఎసి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఫైల్ నెం. ఎస్ఓడబ్ల్యు ఓ 03-14021 (32)/ 24/2021 ను అడ్వాకేట్ జనరల్ ఫైనల్ లీగల్ ఒపినీయన్ కోరింది.
5వ షెడ్యూల్డ్ క్లాజ్- 2 ప్రకారం టిఎసీ రూపొందించిన రెగ్యులేషన్ 1 ఆఫ్ 21 ఆన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొనే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు 2025 మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి ఏజెన్సీ ప్రాంత గిరిజన నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. కనీసం టిఎసి అభిప్రాయాన్ని కూడాపరిగణనలో తీసుకోలేదు. ప్రభుత్వ చర్య వల్ల జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్ తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన ఆభద్రత భావం, ఆందోళన కలిగిస్తోంది.
ఆదివాసులకు 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పిస్తామని 2024 అరకు ఎన్నికల సభలోనూ, ప్రపంచ ఆదివాసీదినోత్సవం ఆగస్టు 9న మరియు ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బహిరంగ మీడియా ప్రకటన ద్వారా హామిచ్చి వున్నారు. యువగలం పాదయాత్ర లో నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. కానీ పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలు నేటికి ఉపక్రమించకపోవడంతో, ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.
రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొనబడినది.రాష్ట్ర ప్రభుత్వంజారీచేసే ఏ ఉత్తర్వులైన 5వ షెడ్యూల్డ్ క్లాజ్ -1, 2 ప్రకారం టిఎసి, గవర్నర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో టిఎసి ఆమోదం లేదు. రాజ్యాంగ స్ఫూర్తిని తమ ప్రభుత్వం కాపాడాలి. తక్షణమే నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీచేసి ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీల కోసం ప్రత్యేక డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయుటకు, నోటిఫికేషన్ విడుదల చేయాలని, తమరు పరిశీలించి ఆదివాసీ రిజర్వేషన్ మరియు హక్కులు, చట్టాలు రక్షణకై తక్షణమే జిల్లా జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్లో ఏజెన్సీ పోస్టులు మినహయించాలని, ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్డ్ ఏరియా) రెగ్యులేషన్ ఆఫ్ రిజర్వేషన్ & అపాయింట్ మెంట్ టు టీచర్ రెగ్యులేషన్ నిమిత్తం ఆర్డినెన్స్ లేదా ప్రెసిడెన్సియల్ ఉత్తర్వులు జారీచేయుటకు తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC వేపాడ చిరంజీవి రావు విశాఖ పట్నం క్యాంప్ ఆపీస్ లో ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ కలిసి వినతి పత్రాన్నీ సమర్పించడం జరిగింది. MLC స్పందిస్తూ ముఖ్యమంత్రి, విద్య శాఖ మంత్రి వద్దకు తీసుకొని వెళ్లి సమస్యను సాధ్యమైన వరకు పరిస్కరణకి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, పి. అప్పల నరస,ఆర్ జగన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు ఎపిటిఎఫ్, ఎల్.సుందరరావు, జిల్లా నాయకులు ఆదివాసీ గిరిజనసంఘం, కుడుముల కాంతారావు, మాజీ జిల్లా అధ్యక్షులు గిరిజన ఉద్యోగుల సంఘం కెకె. జయప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు అఖిల భారత గిరిజనఉద్యోగుల సంఘం డా. చెండా కేశవరావు, రాజబాబు దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ *ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


