నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ తీసుకురావాలి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : ఐ.టి.డి. ఏ పాలక వర్గ సమావేశం వద్దకు నిరసన తెలిపిన ఆదివాసీ గిరిజన సంఘం,ఎస్.ఎఫ్. ఐ, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులను అడ్డుకున్న పోలీసులు.
ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏజెన్సీ ప్రాంత స్థానిక ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేయాలని, ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, పి.అప్పల నరస, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర డిమాండ్ చేశారు.
గిరిజన సంఘం జిల్లా కార్యాలయం నుండి ఐ.టి.డి. ఏ వరకు నిరసన ర్యాలీ నిర్వహించగా, పోలీసులు మూడు చోట్ల అడ్డుకున్నారు. అయినా తోసుకుంటూ ఐ.టి.డి. ఏ వరకు ప్రదర్శన రాగా పోలీసులు అడ్డుకోవడం తో రోడ్ కు అడ్డంగా దిగ్బంధం చేశారు. ఫలితంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వద్దకు ప్రతినిధులు బృందం తీసుకొని వెళ్లి వినతిపత్రని అందించారు.
మీడియా తో నాయకులు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ద్వారా 16,347 టీచర్పోస్టులు భర్తీకి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మెగా డీఎస్సీ లో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 889 గిరిజన సంక్షేమ శాఖ పోస్టుల్లో ఆదివాసీలకు కేవలం 57 పోస్ట్లు మాత్రమే ఆదివాసీలకు కేటాయించడం దారుణం. నోటిఫికేషన్ లో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 100 శాతం రిజర్వేషన్ అమలుపైస్పష్టత ఇవ్వలేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంవల్ల ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టురద్దు చేసిన నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరణకు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్డ్ క్లాజ్ (2) ప్రకారంచట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్ అడ్వాయిజరీ కౌన్సిల్ (టిఏసి) లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమశాఖ సిఫార్సుచేసింది.
కానీ ఏనాడు ఆదివాసులకు100% శాతం ఉద్యోగ రిజర్వేషన్కు చట్టబద్ధత గూర్చి ప్రస్తావన చేయలేదు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకుభద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొనబడినది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్ క్లాజ్(1) (2) ప్రకారం గవర్నర్, టి.ఏ.సి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని తమ ప్రభుత్వం కాపాడాలి.ఆదివాసులకు ప్రత్యేక భాష సంస్కృతి ఉంది.
ఆదివాసీ భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్29,32 ఉల్లంఘించినట్లవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులతో తమ ప్రభుత్వం కాంట్రాక్టర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుభర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు.1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95% పోస్టులుభర్తీచేయడం, 98 శాతం మంది వున్న ఆదివాసుల కోసం కేవలం 6 శాతం పోస్టులు మాత్రమే కేటాయించి భర్తీ చేయడం తగదు.తమ ప్రభుత్వం వెంటనే జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భద్రతా, భరోసా కల్పించిఉపాధ్యాయ పోస్టులు భర్తీకి ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ కి ఆర్డినెన్స్ తీసుకురావాలని, ఆదివాసీ గిరిజన సంఘం కోరుతుంది.
ఈ క్రమంలో జిల్లా కార్యదర్శి పి. బాల్ దేవ్, జిల్లా అధ్యక్షుడు ధర్మాన పడల్,ఎస్.ఎఫ్. ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్, ప్రధాన కార్యదర్శి జీవన్ , మరియు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


