జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 28 at 19.31.20

TRINETHRAM NEWS

ఆదివాసి స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. – పి. అప్పల నరస

మెగా డిఎస్సీ నుండి గురుకులం ఖాళీ పోస్టులు మినహాయింపు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, (అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస డిమాండ్.
గిరిజన గురుకులం లో ఉన్న ఖాళీ పోస్టులను మెగా డిఎస్సీ నుండి మినహాయింపు, ఇవ్వాలని సి.పి. ఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పల నరస డిమాండ్ చేశారు.
పాడేరు ఐ.టి.డి. ఏ వద్ద గిరిజన గురుకులం విద్య సంస్థల అధ్యాపకులు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని చేరుకుని పార్టీ మద్దతు ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ
పదమూడు రోజులుగా రిలే దీక్షలు నిర్వహిస్తున్న,ఔట్సోర్సింగ్ టీచర్లు ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. గత పదిహేను ఏళ్లుగా విద్యారంగంలో అన్ని శాంక్షన్ పోస్టుల్లో సీఆర్టీలు, అవుట్సోర్సింగ్, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వీరిని శ్రమ దోపిడీకి గురి చేస్తోందని,ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా స్పందించ లేదన్నారు. గిరిజన గురుకులం ఖాళీ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సీ లో విలీనం చేయడం తగదు అన్నారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ ద్వారానే పోస్ట్లు భర్తీ చేయాలని ఆయన కోరారు.రాజ్యాంగం కల్పించినహక్కులనే అమలు పరచలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు సాగించే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బోజన్న, చిన్నారావు,దాస్ వివిధ మండలాల గురుకుల, ఔట్సోర్సింగ్ టీచర్లుపాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page