TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, (పాడేరు) జిల్లా ఇంచార్జ్ : ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ సంఘం.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ.

ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లకు, ఉద్యోగ భద్రత కల్పించాలి.

ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పల నరస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విశాఖ పట్నం లో డిసెంబర్ 19 నుండి 21వరకు, విశాఖపట్నం నండూరి ప్రసాదరావు భవనం లో మూడు రోజులు పార్టీ ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ సంఘం రాష్ట్ర కమిటీ ప్లినం సమావేశం లో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పల నరస ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీ తెగలు ఉన్నత వంతులుగా మార్చడానికి స్థానిక ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లు రెగ్యులర్ ఉపాధ్యాలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని, కానీ కనీస వేతనం కూడా పెంచడం లేదని ఆరోపించారు. 2003 లో ప్రారంభించిన ఆదివాసీ మాతృ భాష విద్య బోధన వల్ల రాష్ట్రంలో 45శాతం నుండి, 49శాతానికి ఆదివాసీ అక్షరాస్యత పెరిగిందని అన్నారు.సుమారు 20 ఏళ్లగా విధులు నిర్వహిస్తున్న ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ లకు 2017 నుండి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, టైం స్కేల్ అమలు చేయాలని కోరారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5 వ తరగతి వరకు ఆదివాసీ మాతృ భాష విద్య బోధన అందించాలని,అన్ని ఆదివాసీ గ్రామాలకు మాతృ భాష విద్య బోధన వ్యవస్థ విస్తరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ మాతృ భాష ఉపాద్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాంగీ శ్రీను,ప్రధాన కార్యదర్శి సవర ధోంబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App