జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 02 at 17.59.24

TRINETHRAM NEWS

Additional Collector G.V. Shyam Prasad Lal said land survey work should be completed on time

పెద్దపల్లి, జూలై- 02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో ఉన్న భూ సమస్యల పరిష్కారం, వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ సంబంధించిన భూ సర్వే ప్రక్రియ వేగవంతంగా సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు.

మంగళవారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో భూ సర్వేపై మండల సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ,భూ వివాదాల పరిష్కారం కోసం సరిహద్దు సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

ఎన్టిపిసి భూ సేకరణ నిమిత్తం సదరు భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియజేస్తూ ఎంజాయ్మెంట్ సర్వే రైతుల వారీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో భూ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Additional Collector G.V. Shyam Prasad Lal said land survey work should be completed on time

You cannot copy content of this page