జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 28 at 19.40.58

TRINETHRAM NEWS

Additional Collector G.V.Shyam Prasad Lal has special focus on Singareni land acquisition process

పెద్దపల్లి, మే- 28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి క్రింద చేపట్టాల్సిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు
మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పెండింగ్ భూ సేకరణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, రామగిరి మండలంలోని సుందిళ్ల ముస్త్యాలల గ్రామాలలో సింగరేణి పరిధి క్రింద గతంలో చేపట్టిన భూసేకరణ ప్రక్రియ ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు
భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు
ఈ సమీక్షా సమావేశంలో సింగరేణి ఆర్.జే.ఎం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Additional Collector G.V.Shyam Prasad Lal has special focus on Singareni land acquisition process

You cannot copy content of this page