త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు నామినేషన్ కేంద్రాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి తో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్, ఎన్నికల సిబ్బందితో మాట్లాడి భద్రతా చర్యలు, శాంతియుత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహణపై సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
100 మీటర్స్ దూరం లోనే అందరి ఆపివేయాలని, నామినేషన్ సెంటర్ లోకి అభ్యర్థి తో పాటు ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


