Jayashankar Jayanti : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) కమిషనర్ జె. అరుణ ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , ఆర్ . ఓ ఆంజనేయులు , అక్కౌంట్స్ ఆఫీసర్ రాజు , టి పి ఓ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , ఆర్ ఐ లు శంకర్ రావు , ఖాజా , మెప్మా టి ఎం సి మౌనిక , సి ఓ లు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

  1. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన అవగాహనా పర్యటనలో రామగుండం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది , మెప్మా అమృత మిత్రలు మల్కాపూర్ ఎఫ్ ఎస్ టి పి
    ( ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ) సందర్శించారు. ప్లాంట్ నిర్వాహకులు మల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసే విధానాలను వివరించారు కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా ముబారక్ నగర్ లో పిచ్చి చెట్లు తొలగించారు. సప్తగిరి కాలనీ తో పాటు పలు డివిజన్ లలో మొక్కలు నాటారు . మార్కండేయ కాలనీ లోని ఆస్తి పన్ను మధింపు చేయడం , సవరించడంలో భాగంగా భవనాల కొలతలు నమోదు చేసుకున్నారు . రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఆర్ ఐ శంకర్ రావు , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Acharya Kothapalli Jayashankar Jayanti

You cannot copy content of this page

Scroll to Top