TRINETHRAM NEWS

భవిష్యత్తు వ్యవసం- ప్రకృతి సేద్యం- మంత్రి అచ్చం నాయుడు
Trinethram News : ఆంధ్ర ప్రదేశ్, అమరావతి:- ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, రైతుల్ని చైతన్య పరచటానికి రైతు సాధికారత సంస్థ -వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు తెలియజేశారు. రసాయన వ్యవసాయం ద్వారా భూమి తన స్వభావాన్ని కోల్పోయిందని, తిరిగి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవాలని, అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుందని అసెంబ్లీలో తెలియజేశారు.
A.p.c.n.f లో నూతన సాగు పద్ధతుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. P.M.D.S పద్ధతి ద్వారా భూసారాన్ని పెంచి ,అధిక దిక్కుబడి తీసుకురావడం.A గ్రేడ్ పద్ధతి ద్వారా ప్రధాన పంటలతో పాటు, ఇతర అంతర పంటల సాగు పద్ధతి, 20 సెంట్లు భూమిలో A.T.Mమోడల్ పద్ధతి ద్వారా రైతుల ఆదాయం పెంచడం వంటి పద్ధతులు అవలంబిస్తున్నామని, 2024 -25 స, A.P.C.N.F లో 13 లక్షల మంది రైతుల్ని 6. 64 లక్షల హెక్టార్ల భూమి లో ప్రకృతి వ్యవసాయ విధానాలు అమలు దిశగా అడుగులు వేస్తుందని, ఈ కార్యక్రమాలు అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదిస్తున్నట్ల చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App