జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 11 at 17.49.11

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల జిల్లా తేది:11.11.2024.

మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్” లో విజేతగా నిలిచిన బాపట్ల జిల్లా పోలీస్ జట్టు

జిల్లా పోలీస్ జట్టు సభ్యులను అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన “మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్” లో బాపట్ల జిల్లా పోలీస్ జట్టు టోర్నమెంట్ విజేతగా నిలిచింది. నవంబర్ 11న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ జట్టు సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, గెలుపొందిన కప్పును, నగదు బహుమతిని వారికి అందజేసినారు.

టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బాపట్ల స్ట్రైకర్స్ జట్టు పై బాపట్ల పోలీస్ జట్టు విజయం సాధించింది. టోర్నమెంట్ విజేతగా నిలిచిన పోలీస్ జట్టుకు కప్పుతో పాటు ఇరవైవేల నగదు బహుమతిని, క్రీడాకారులకు మెడల్స్ ను నిర్వాహుకులు అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన మ్యాచ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ లో జిల్లాలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది ఒక జట్టుగా ఏర్పడి పాల్గొని విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 24 గంటలూ విధి నిర్వహణలో ఉండే పోలీస్‌ సిబ్బందికి క్రీడలలో పాల్గొనడం వలన ఒత్తిడిని అధిగమించి మానసికంగా దృడంగా ఉంటారన్నారు. మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్.ఐ మౌలుద్దీన్, ఐటీ కోర్ ఎస్.ఐ నాయబ్ రసూల్, సీసీ హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page