Accidents : మడికొండ అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం ప్రమాదాలు

TRINETHRAM NEWS

మే 26 2025 (త్రినేత్రం న్యూస్) మడికొండ: కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 163 జాతీయ రహదారి అండర్ బ్రిడ్జి మడికొండ వద్ద ధర్మసాగర్ మడికొండ ఇరువైపుల నుండి వచ్చే వాహనాలకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. టేకులగూడెం రహదారి నుండి వచ్చే వాహనాలకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలి మరియు రహదారి కి ఎదురుగా కుంభకార అద్దం ఏర్పాటు చేయాలి
మరియు ఏలుకుర్తి రహదారి నుండి వచ్చే వాహనాలకు కూడా కుంభకార అద్దం ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వాహనదారులు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Accidents at Madikonda Underbridge

You cannot copy content of this page

Scroll to Top