Illegal Sand : అక్రమ ఇసుక రవాణాతో ఎమ్మెల్యేలకు ప్రతి రోజు 10 లక్షలు రాబడి

TRINETHRAM NEWS

త్వరలో ర్యాంప్ ల వద్దకు అఖిలపక్ష పార్టీలు బృందం

సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆరోపణ

రాజమహేంద్రవరం మే 26 : పేరుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తున్నామని చెప్తున్నారు గానీ అదంతా బోగస్ అని రాత్రి వేళల్లో అడ్డు అదుపు లేకుండా అక్రమ ఇసుక రవాణా వ్యాపారం సాగుతుందని గోదావరికి ఆనుకుని ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు 10 లక్షల అక్రమ రాబడి వస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు.. సోమవారం ఉదయం స్థానిక క్వారీ సెంటర్లో పార్టీ శాఖ బహిరంగ సభ టీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది

ఈ సభలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా ఇసుక ర్యాంపులలో ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారం కూటమి ఎమ్మెల్యే అనుచరులు ఇష్టానుసారం అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మైనింగ్ శాఖ చోద్యం చూస్తుందని మధు విమర్శించారు ఒకటన్ను ఇసుక 160 నుండి 170 రూపాయలు అమ్మకాలు జరపాల్సి ఉండగా టన్ను 270 నుండి 300 రూపాయలు వసూలు చేస్తున్నారని అలాగే ఒక లారీకి 18 టన్నుల ఇసుక రవాణా చేయాలి కానీ 30 నుండి 40 టన్నులు ఇసుకను అదనంగా రవాణా చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నారని ఇవన్నీ ప్రతి రోజుకు 10 లక్షల రూపాయలు అక్రమంగా ఎమ్మెల్యేలకు అందుతుందని ఆయన ఆరోపించారు చాలాచోట్ల బాటసారి చార్జి అదనంగా లారీకి ₹1000 వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. వంగలపూడి, మురకలంక, పెరవలి, పెండ్యాల, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, కడియం, రాజమండ్రి ఈ ప్రాంతాలలో ఇసుకను దోచేస్తున్నారని ఆయన తెలిపారు త్వరలో దీనిపై అఖిలపక్ష పార్టీలతో ర్యాంపులలో పర్యటించి నిగ్గు తేలుస్తామని తుది నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని ఆయన అన్నారు ఇప్పటికైనా అక్రమ రవాణా ఇసుక ఆపకపోతే ర్యాంపుల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మధు హెచ్చరించారు. కొన్ని రాంపులలో పెద్దపెద్ద యంత్రాలను ఉపయోగించి పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుoడ్రపు రాంబాబు జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య కే శ్రీనివాస్ పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Illegal sand transportation earns

You cannot copy content of this page

Scroll to Top