TELANGANA

New Management Responsibilities : నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 19, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ బాధ్యతల స్వీకరణ సందర్భంగా దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ రోడ్ షో కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ,మరియు కుటుంబ సమేతంగా పాల్గొని, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులకు పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
దేవరకొండ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం గెలుపుగా మారిందని, ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో వేగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు..
ఈ విజయం కార్యకర్తల అంకితభావం, నాయకత్వం, ప్రజా దైవ మద్దతు వల్లే సాధ్యమైందని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని నాయకులకు సూచిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. దేవరకొండ మున్సిపల్ లో ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన దేవరకొండ ప్రజలకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ విజయం వేలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా, రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద–మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు.
ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్న ఎమ్మెల్యే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో దేవరకొండ మున్సిపాలిటీనీ మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్ల, కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Acceptance of new management responsibilities.

You cannot copy content of this page