జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 26 at 11.30.04 AM

TRINETHRAM NEWS

ACB inspections in Vemulawada Rajanna Temple in the wake of allegations of corruption by temple officials in various departments.

వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు.

Trinethram News : తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి.

20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు.

వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి.

తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక పరిచారికను కూడా బాధ్యతలు నుంచి తొలగించారు.

ముగ్గురు పర్యవేక్షకులతోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి 20 జారీచేసిన మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు ఈవో వినోద్ రెడ్డి. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ACB inspections in Vemulawada Rajanna Temple in the wake of allegations of corruption by temple officials in various departments.

You cannot copy content of this page