మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్న సుమారు 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

TRINETHRAM NEWS

మహారాష్ట్ర అక్రమంగా తరలిస్తున్న సుమారు 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండము కమిషనరేట్ మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి మేకల మండి ప్రాంతంలో ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అనుమానస్పదంగా వెళుతున్న ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 07 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే TS27T 3167 నంబర్ గల ట్రాలి ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .

పట్టుబడిన నిందితుడి వివరములు:

మోటం రాజు s/o గంగారాం, వయస్సు :35 సంవత్సరాలు, కులం: బుడగ జంగం, occ: వ్యాపారం, మందమర్రి, విద్యానగర్

స్వాధీ పరుచుకున్న వాటి వివరములు
పిడిఎస్ రైస్ 07 క్వింటాళ్ళు వాటి విలువ 21,000 రూపాయలు /-

పట్టుబడిన వాహనాన్ని మరియు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top