YS Sharmila Reddy : ఎదుర్కొనే సత్తా

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం ఆనంద్ ఫంక్షన్ హాల్లో పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీని ఎదిరించగల శక్తి కేవలం కాంగ్రెస్ కె ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపి పై మౌనంగా ఉండి కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శిస్తున్నారని ఆమె ఆరోపించడం జరిగింది.
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని, రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అందుతున్నాయని ప్రజలు అనడం జరిగింది.

ఉచిత ఇసుక, దీపం-టు పథకం కింద గ్యాస్ సిలిండర్లు, మహిళలకు కుట్టు మిషన్లు, తల్లికి వందనం, మంచి విద్యా, వైద్యం , ఇంత మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తుంటే కాంగ్రెస్ బురద జల్లుతుందని ప్రజలు అనుకుంటున్నారు. త్వరలోనే ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలు అవుతాయని ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ability to face

You cannot copy content of this page

Scroll to Top