Trinethram News : వెంటనే సమస్య పరిష్కరించకుంటే కిందకు దూకుతానంటూ ఓ యువ రైతు మెదక్ కలెక్టరేట్ భవనం ఎక్కి హల్చల్
హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ తండ్రి రమేశ్ పేరున 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. పాతూర్ శివారులో మరో ఎకరం పొలం ఉండగా, మరికొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం సమయంలో తండ్రి రమేశ్‌కు పట్టాదార్ పాసు పుస్తకం వచ్చింది.. కానీ అందులో సురేందర్ ఫొటోతో ఆధార్ లింక్ చేశారు.
దీంతో రైతుబంధు, పంట రుణాలు పొందలేకపోతున్నారు. ఇదే క్రమంలో శమ్నాపూర్ శివారులో సురేందర్ గుంట వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు..అది అతని తండ్రి రమేశ్ పేరున వెళ్లింది.
దానికి సైతం రైతుబంధు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆత్మహత్యకు యత్నించాడు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


