WhatsApp Image 2023 12 21 at 12.46.33 PM
విషాదం.. అమెరికాలో విజయవాడ యువతి మృతి
అమెరికాలో విజయవాడకు చెందిన యువతి మృతి చెందింది.
కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు.
బుధవారం షికాగో నగరంలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో డ్రైవర్‌తో పాటూ నాజ్ కూడా స్పృహ తప్పారు.
ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
