జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 29 at 16.15.09

TRINETHRAM NEWS

జూనియర్ సివిల్ జడ్జిగా మొదటి ప్రయత్నంలోనే ఎంపికైన గిద్దలూరు యువకుడు

Trinethram News : ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి ఖ్వాజా రహీం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రహీం మేనమామ అయిన 12వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అల్తాఫ్ సహకారంతో ప్రయోజకుడుగా మారాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి విద్యను రహీం అభ్యసించాడు. ఇటీవల పరీక్షలు రాసిన రహీం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. పలువురు రహీమ్ ని అభినందిస్తుండగా తన అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన మేనమామతో పాటు కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page