జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 12 at 19.05.51

TRINETHRAM NEWS

కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ

గంటల వ్యవధిలో ఆటోను గుర్తించి 10 తులాల బంగారు ఆభరణాలు గల బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని భాదితురాలుకు అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన మామిడిపల్లి హేమశ్రీ భర్త గణేష్ తో కలిసి కరీంనగర్ లోని ఒక పెళ్లి వేడుకకు హాజరైంది. తిరిగి జగిత్యాలకు వెళ్లేందుకు ఫంక్షన్ హాలు నుండి బస్ స్టాండ్ కు ఆటోలో ప్రయాణించింది. ఆటో దిగి బస్ స్టాండ్ లోకి వెళ్లిన మహిళ కొద్దిసేపటికి తన బ్యాగును ఆటోలోనే మరిచి దిగిందని గ్రహించి అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తన క్రైమ్ సిబ్బందిని అప్రమత్తం చేసి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించిన పోలీసులు సంబంధిత ఆటో డ్రైవర్ నుండి బ్యాగును, అందులోని 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భాదితురాలకు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందజేశారు.
బంగారు ఆభరణాలు గుర్తించి పట్టుకునేందుకు కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, కానిస్టేబుళ్లు కుమార్, సంపత్ లను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి అభినందించి రివార్డు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page