TRINETHRAM NEWS

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.
శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు
మొబైల్ యాప్ సర్వే విధానంపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపిడిఓలు, ఏం పి ఓ లు,తహశీల్దార్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. మొబైల్ యాప్ ను వినియోగిస్తూ క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన తీరును,వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఏయే అంశాలను పరిశీలించాలి, మొబైల్ యాప్ లో వివరాలను ఏవిధంగా పొందుపర్చాలి అనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ,క్షేత్రస్థాయి సర్వే కోసం ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఇతర సిబ్బంది అందరికి యాప్ ద్వారా సర్వే జరపాల్సిన విధానంపై అన్ని మండలాలలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఎంపిడిఓలు, ఎం పి ఓ లు,తహసీల్దార్లను ఆదేశించారు. సర్వే సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలను పక్కాగా సేకరిస్తూ, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యాప్ లో వివరాలను అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరపాలని అన్నారు.ఎక్కడైనాఅవకతవకలకు పాల్పడితే ఇబ్బందులుఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరించారు. ఎలాంటివివాదాలు,అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను నిజాయితీగా,నిబద్ధతతోచేపడుతూ గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ సుధీర్,సిరాజుద్దీన్ హోసింగ్ ఏ ఈ.మహమ్మద్ ఖలీముద్దీన్,సయ్యద్ మొక్రంబాబా .డి ఇ లు,సాజిద్, ఎం. చందర్.సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నార

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App