
Trinethram News : గోపాలపురం మండలం.
స్థానిక గోపాలపురం పెద్దగూడెంలో ఆకస్మిక పర్యటన చేసిన కలెక్టర్ ప్రశాంతి….
గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన దృష్ట్యా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి….
మూడు రోజుల క్రితం పెద్దగూడెంలో పర్యటన చేసిన కలెక్టర్ మంచినీటి ట్యాంకులు వద్ద పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు….
ఈ నేపథ్యంలో ఆకస్మిక పర్యటన చేసి అధికారులు స్పందన ఎలా ఉందని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరైజేషన్ చేస్తున్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు….
ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆకస్మిక పర్యటనలు చేస్తున్న దృష్ట్యా బెంబేలెత్తిపోతున్న అధికారులు….
ఆదేశాలను ఎప్పటికప్పుడు పునః సమీక్ష చేస్తున్న విధానంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
