CITU : అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి.(సిఐటియు) డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 21: కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం అమలు అయ్యే విధంగా రైల్వే యాజమాన్యం కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని రైల్వే కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యూనియన్ ఆధ్వర్యంలో అరకులో గిరిజన సంఘం కార్యాలయంలో ఉద్యోగ భద్రత, జీవో ప్రకారం కనీస వేతనం అమలు వంటి అంశాలపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు హాజరయ్యి ప్రసంగించారు.

అరుకు కేకే లైన్లో ట్రాక్మెన్ వర్కర్స్, శాంటేషన్, రన్నింగ్ రూమ్, గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉన్నారని వీరంతా వెనకబడిన గిరిజనులేనని వీరికి కనీస వేతనాలు ఇతర పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు కావడం లేదని తెలిపారు తక్షణం కార్మికులకి చట్టపకరం రావాల్సిన రాయితీలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ను ప్రైవేటుకరించాలని కుట్రలు ఉన్నాయని తెలిపారు అందులో భాగంగానే రైల్వే స్టేషన్ ను ఆధునికరించి కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్రయత్నిస్తుంది. ప్రైవేటీకరణ జరిగితే కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉండదని తెలిపారు.

కార్మికుల పోరాట సాధించుకున్న కార్మిక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని చూస్తుందని తెలిపారు ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ కనీస వేతన చట్టం కానీ సామాజిక భద్రత కానీ ఉండదని తెలిపారు. ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులు చట్టాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తుందని తెలిపారు
జీవో నెంబర్ 3 వంటి ఇప్పటికే కనుమరుగైందని దీంతో నిరుద్యోగులు దిక్కులేని పరిస్థితి అయిందని అన్నారు 1/70 చట్టం చాప కింద నీరులకు తొలగించాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వర మాట్లాడుతూ భవిష్యత్తులో రైల్వే ప్రైవేటీకరణ, కార్మికులు ఉద్యోగులు భద్రత కనీస వేతనం చట్టాలకే అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సన్యాసిరావు, మహేష్, త్రినాధ్, బోరయ్య, కృష్ణ పాల్గొన్నారు. బొడ్డవరం, ఎస్ కోట, మల్లి వీడు, బుర్ర, సిమిలిగూడ, కరకవలస, చిముడుపల్లి, అరకు తైడ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

(CITU) Demand to enforce

You cannot copy content of this page

Scroll to Top