తేదీ : 09/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహము నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించాలని ఎమ్మెల్యే కొ లికపూడి. శ్రీనివాసరావు అన్నారు. రెండు రోజుల క్రితం వార్తల్లో అమరావతి రాజధాని మహిళల శీల ఆసనం గురించి కొమ్మినేని. శ్రీనివాసరావు ఒక చానల్లో ఏర్పాటుచేసిన డిబేట్ లో కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది.
అటువంటి మాటలను, దృశ్యాలను ప్రచారం చేసిన ఆ ఛానల్ పత్రికను తక్షణమే మూసివేయాలంటూ మహిళలు ఈనెల పదవ తేదీన అనగా మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించాలని , ఎమ్మెల్యే తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు, మహిళా సంఘాలు, అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలు అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


