రాజమండ్రి, మే 11: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జైన్ సేవ సమితి, మగ్న మొనర్ & చైల్డ్ హాస్పిటల్, జాగృతి స్పెషల్టీ పాతోలజీ లేబొరేటరీ మరియు జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈరోజు స్థానిక చర్చిపేటలోని గీతా అప్పరా థియేటర్ సమీపంలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి.
ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం జనసేన సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ “దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిది. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మురళీ నాయక్ వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగానికి మనమంతా సెల్యూట్ చేయాలి. ప్రభుత్వం వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ కుటుంబానికి అనుశ్రీ సత్యనారాయణ వీరమరణంపట్లతన సంతాపాన్ని తెలియజేశారు.అలాగే తలసేమియా అనేది ఒక జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి.
ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ప్రతి మూడు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. రక్తదాతల సహకారం లేకపోతే ఈ చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఈ నేపథ్యంలో, దాతల నుండి విరాళాలు సేకరించి తలసేమియా పిల్లలకు నిరంతరాయంగా రక్త సరఫరాను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని జైన్ సేవా సమితి ఏర్పాటు చేశారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు నగర జనసేన నాయకులు వీరామహిళలు జనాసైనికులు పాల్గున్నారు.
(రక్త దానం చేసిన సిటీ కార్యదర్శి విన్నావాసు జనసేన యువ నాయకులు బయ్యాపూనీడి సూర్య జనసేన నాయకులు మసానని, ప్రవీణ్, సుధీర్ మరియు సూర్య మిత్ర బృందని) మరియు రక్తదాతలుని అనుశ్రీ అభినందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


