WhatsApp Image 2024 02 15 at 07.56.17
Trinethram News : హైదరాబాద్ :
పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీ చేశారు.
బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది.
బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యాజమానిపై కత్తితో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు..
క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
దుకాణంలో ఎంత బంగారం చోరీకి గురైందనే వివరాలు తెలియాల్సి ఉంది.
