Trinethram News : చింతల్ లోని కెఎం.పాండు మార్గ్ లోని బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించిన కె.ఎం.పాండు తనయుడు, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, బిఆర్ఎస్ శ్రేణులు…
ఈరోజు చింతల్ ప్రధాన రహదారిలోని కెఎం. పాండు మార్గ్ లో నిర్వహించిన కుత్బుల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, దివంగత నేత కెఎం.పాండు 7వ వర్థంతి కార్యక్రమంలో వారి తనయుడు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ,కుత్బుల్లాపూర్ మాజీ కార్పొరేటర్ కెఎం.గౌరీష్ బాపూ కె.ఎం.పాండు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తన జీవిత పర్యాంతం కుత్బుల్లాపూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేసిన మహోన్నత నాయకులు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన చిరస్మరణీయ నేత కెఎం.పాండు ని అన్నారు. ఇందిరా గాంధీ ప్రభుత్వంలో నాడు కుత్బుల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పాండు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ అయిన “జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఏర్పాటుచేయించి అభివృధ్ధి చేసిన ఘనత పాండు కి దక్కుతుందన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే అందరికీ విద్యా అందించాలని, నిరుపేదల విద్య కోసం అనునిత్యం తపించిన నాయకులు కె.ఎం.పాండు అని అన్నారు. వారి ఆశయ సాధనలో భాగంగానే ఒకేషనల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు కుత్బుల్లాపూర్ లోని ఎంతోమంది నాయకులు కుత్బుల్లాపూర్ పాఠశాలలోనే విద్యనభ్యసించారన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


