Abhaya Anjaneya Swamy : ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

TRINETHRAM NEWS

తేదీ : 14/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపుకోట మండలం, తాడిచర్ల గ్రామంలో ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించారు. తెలుగుదేశం పార్టీ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన టిడిపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ విధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు శ్రేణులందరూ పాల్గొన్నారు. వేద పండిత బ్రాహ్మణులు సంబంధిత మంత్రాలతో అగ్ని హోమాలు నిర్వహించి, గణపతి పూజ మరియు ఆంజనేయస్వామి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. సంబంధిత భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. సర్పంచ్ పి. పార్థసారథి దంపతులు శ్రీమతి లక్ష్మీ తులసి, యం.

పెంటయ్య గిరిజ మనోహరి, యం. రామకృష్ణ వరప్రసాద్ పద్మశ్రీ , ఆర్. రత్న శేఖర్, యోగానంధ ఆర్. మాధవరావు నాగ తులసి, యం. సాయి, దుర్గ ప్రసన్న, డి. వెంకటేశ్వర్లు రామలక్ష్మి, ఆర్. దుర్గారావు దుర్గారత్నం యు. సోమేశ్వరావు, దుర్గ,, సి. భాస్కర్ రావు , శ్రీదేవి , ఎ. నాగేశ్వరరావు, కళ్యాణి ప్రత్యేక పూజలో కూర్చున్నారు.
ప్రజలందరి కుటుంబంలో ఎవరికి ఎటువంటి లోతుపాట్లు, రాకుండా , లేకుండా మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో , సిరిసంపద కలిగి ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నారని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A grand installation of

You cannot copy content of this page

Scroll to Top