పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు

TRINETHRAM NEWS

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు

Trinethram News : వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఇరువర్గాల వారు తీవ్రంగా గాయపడడంతో వారిని కావలి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలోనే మళ్లీ దాడులు చేసుకున్నారు.

అయితే వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు కాకాణి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, పోలీసు అధికారులు సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ కాకాణి తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ వారినీ వదిలేది లేదంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగారు. దీనిపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింది కేసులు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top